టీచర్లకు ఏపీ సర్కార్‌ శుభవార్త..ప్రమోషన్లు, బదిలీలపై కీలక ప్రకటన

-

టీచర్లకు ఏపీ సర్కార్‌ శుభవార్త చెప్పింది. ప్రమోషన్లు, బదిలీలపై కీలక ప్రకటన తాజాగా వెలువడింది. టీచర్ ఎమ్మెల్సీలతో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు బాల సుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, పి.రఘువర్మ, కల్పలత, షేక్ సాబ్జీ, శ్రీనివాసులు రెడ్డి , ఐ. వెంకటేశ్వరరావు హాజరయ్యారు. పలు సమస్యల పై ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞాపన పత్రం ఇచ్చారు ఎమ్మెల్సీలు.

CM Jagan Mohan Reddy

టీచర్లకు సంబంధించిన పీఎఫ్, ప్రమోషన్లు, బదిలీలు, ఖాళీల భర్తీ, అప్ గ్రేడ్ అయిన స్కూళ్లకు పోస్టుల మంజూరు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. మున్సిపల్ స్కూళ్లను అప్ గ్రేడ్ చేయాలని కోరారు ఎమ్మెల్సీలు.

నూతన విద్యావిధానం 2020 ప్రకారం మున్సిపల్ స్కూళ్ల మ్యాపింగ్ ప్రక్రియ తరువాత సిబ్బంది కొరత, అప్ గ్రేడేషన్ వంటి సమస్యలు పరిష్కారమవుతాయని ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పరీక్షలు పూర్తైన తరువాత ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ అన్న మంత్రి బొత్స సత్యనారాయణ… హైస్కూళ్ల హెడ్ మాస్టర్లకు డీడీఓ బాధ్యతలను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. పీఎఫ్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ నాయక్‌ను ఆదేశించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version