విశాఖనే రాజధాని… కోర్టును ఒప్పించి తీరుతాం : బొత్స

-

ఎవరెన్ని చెప్పినా విశాఖ కు రాజధాని వెళ్లడం ఖాయమని.. దీనిపై న్యాయస్థానాన్ని ఒప్పిస్తాం..న్యాయస్థానం ఆదేశాల మేరకే వెళతామని పట్టణాభి వృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇవాళ ఆయన మీడియా తో మాట్లాడుతూ.. రాజధాని కేసులను రోజు వారీ విచారణ చేస్తాం అన్నారు కదా..? మరి పిటిషనర్లు మూడు నెలలు వాయిదా అడగడం వెనుక ఏం ఉద్దేశ్యాలు ఉన్నాయని ఫైర్ అయ్యారు. వాళ్లే కదా కేసు వేసింది..ఎందుకు వాయిదా అడిగారు..? అని పిటిషనర్లను నీలాదీశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలనే విధానానికి ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయం తో ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం పట్టణాల్లో వ్యర్ధాల మేనేజమెంట్ పై దేశ వ్యాప్తంగా సర్వే చేసిందని.. దేశంలోనే అన్ని నగరాల్లో స్వచ్ఛ భారత్ కింద వ్యర్ధాల మేనేజ్మెంట్ లో సర్వే చేశారన్నారు. 9 నగరాలను కేంద్రం గుర్తిస్తే రాష్ట్రం నుండి 3 నగరాలు ఎంపిక అయ్యాయని గుర్తు చేశారు. తిరుపతి, విజయవాడ, విశాఖ పట్నంలు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ కు ఎంపికయ్యాయన్నారు. అన్ని పట్టణాలను ఇలానే తయారు చేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. Tidco ఇళ్లను 6 నెలల్లో 80 వేలు..మరో 6 నెలల్లో మరో 80 వేలు… మిగిలినవి తర్వాత 6 నెలల్లో ఇస్తామన్నారు. మొత్తం 2.60 లక్షలు Tidco ఇల్లు ఉన్నాయి…అన్ని త్వరగా ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news