ప్రెగ్నెన్సీ లో మొదటి కొన్ని వారాల పాటు ఫోలిక్ యాసిడ్ ( Folic Acid ) చాలా అవసరం. అయితే ఎక్కువ అమౌంట్ ఫోలిక్ యాసిడ్ మన బాడీ లో స్టోర్ అవ్వదు. యూరిన్ ద్వారా ఫోలిక్ యాసిడ్ అనేది బయటకి వచ్చేస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా ఫోలిక్ యాసిడ్ మీ డైట్ లో తీసుకోవడం మంచిది లేదు అంటే ఫోలిక్ యాసిడ్ లోపం కారణంగా ఇది జన్మించే శిశువు పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి పోలిక్ యాసిడ్ సమృద్ధిగా డైట్ లో తీసుకోవడం మంచిది.
ప్రెగ్నెన్సీ లో ఫోలిక్ యాసిడ్ వల్ల కలిగే లాభాలు:
చాలా రీసెర్చర్లు దీనిపై ఎన్నో విషయాలను చెప్పడం జరిగింది అయితే దాని వల్ల కలిగే లాభాలు గురించి చూస్తే..
మిస్ క్యారేజ్ రిస్కు తగ్గుతుంది:
పోలిక్ యాసిడ్ లోపం ఉంటే మిస్ క్యారేజ్ సమస్యలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండేట్టు చూసుకోండి.
న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్:
సరిగ్గా ఫోలిక్ యాసిడ్ లేకపోతే బ్రెయిన్ డామేజ్ వంటి సమస్యలకు దారి తీస్తుంది కాబట్టి కచ్చితంగా ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా తీసుకునేలా చూసుకోండి. అదేవిధంగా పుట్టబోయే బిడ్డకి గుండెలో చిల్లు పడటం లేదా 37 వారాలకి ముందే జన్మించడం లాంటి సమస్యలు వస్తాయి.
ఫోలిక్ యాసిడ్ దేనిలో ఉంటుంది..?
ఫోలిక్ యాసిడ్ ఆకుకూరలలో ఉంటుంది. అలానే బ్రోకలీ, అవకాడో, బీన్స్, బొప్పాయి, అరటి పండ్లు, కమల పండ్లు, బ్రెడ్, పాస్తా వంటి వాటిలో ఉంటుంది, అదేవిధంగా రైస్ లో కూడా ఉంటుంది కాబట్టి ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుని గర్భిణీలు ముందుగానే ఈ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి.