భారతీయ జనతాపార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ భౌతిక దేహాన్ని ఉంచిన శవ పేటిక పై జాతీయ జెండా ఉంచటం వివాదంగా మారింది. కళ్యాణ్ గెస్సింగ్ భౌతిక దేహం ఉన్న శవపేటిక సగభాగం జాతీయ జెండా బయటకి కనిపిస్తోంది. మిగతా సగభాగం పై బీజేపీ జెండా ఉంచారు నాయకులు. అయితే జాతీయ పతాకం పై భారతీయ జనతా పార్టీ జెండాను ఉంచడం పై… కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.
ఈ ఘటన తో జాతీయ జెండా కు అవమానం జరిగిందని కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. జాతీయ జెండా పై పార్టీ జెండా ఉంచాలని అటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు , ఎంపీ శశి థరూర్ సహా పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశభక్తి పేరు చెప్పుకునే భారతీయ జనతా పార్టీ…. ఇలా చేయడం ఏంటని నిలదీస్తున్నారు. కాగా 2 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.