గవర్నర్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాయడం ద్వారా లక్ష్మణ రేఖను దాటారని బొత్స సత్యన్నారాయణ అన్నారు. వ్యక్తిగత ప్రతిష్ట కు భంగం కలిగేలా వారి లేఖలో పేర్కొన్నారన్న ఆయన గతంలో ఏ ఎన్నికల అధికారి ఈ తరహాలో వ్యవహరించలేదని అన్నారు. ఎన్నికల కమిషనర్ పై స్పీకర్ కు ఫిర్యాదు చేశామని, విచారణ జరిపించాలని కోరామని అన్నారు. నేను కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ కేబినెట్ కు కొత్త కాదన్న ఆయన జిల్లాల పర్యటనల్లో ఎన్నికలతో సంబంధం లేని అంశాలు ప్రస్తావించడం ఎలా చూడాలని ప్రశ్నించారు.
నిమ్మగడ్డ ద్వంద్వ వైఖరిని సూటిగా ప్రశ్నిస్తున్నామన్న ఆయన నిమ్మగడ్డ పరిధిని దాటి పరిధికి మించి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇది దుష్ట సంప్రదాయం అని భవిష్యత్ తరాలకు ప్రమాదకరమని అన్నారు. రాజ్యాంగానికి లోబడి పనిచేసే వ్యక్తులం మేమన్న ఆయన మా పై నిమ్మగడ్డ రాతలు చూస్తే బాధగా ఉందని అన్నారు. రాజకీయాల కోసమే అయితే పదవికి రాజీనామా చేసి రండని ఆయన అన్నారు. ప్రత్యక్షంగా ఎత్తి పొడుపు మాటలు మాట్లాడుతున్న నిమ్మగడ్డ మేథావినని ఫీల్ అవుతున్నారని చెప్పుకొచ్చారు.