ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్న విషయం విదితమే. భారత్‌లో జనవరి 16 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో ప్రైవేటు ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే ఆ దేశంలో సుమారుగా 70వేల మందికి నకిలీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌లో ఓ క్లినిక్‌లో డాక్టర్ లూషియా పెనాఫియల్ ఎలాంటి రక్షణ లేకుండా కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తోంది. అంతే కాదు, ఆ క్లినిక్ ద్వారా నకిలీ కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 70వేల మందికి నకిలీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే ఈ విషయం తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆ క్లినిక్‌ను సీజ్ చేశారు.
ఆ క్లినక్‌లో భారత కరెన్సీ ప్రకారం ఒక్క డోసు వ్యాక్సిన్‌ను రూ.1100కు విక్రయిస్తున్నారు. మూడు డోసులు తీసుకుంటేనే వ్యాక్సిన్ పనిచేస్తుందని చెప్పడంతో స్థానికులు 3 డోసుల చొప్పున తీసుకుంటున్నారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ నకిలీ అని తేలడంతో ఆ క్లినిక్‌ను సీజ్ చేశారు. అక్కడి డాక్టర్లను, సిబ్బందిని అరెస్టు చేశారు. అయితే వ్యాక్సిన్ కానప్పుడు మరి వారికి ఏ మెడిసిన్‌ను ఇంజెక్షన్ రూపంలో ఇచ్చారు ? అనే వివరాలు ఇంకా తెలియలేదు.