బాటిల్ క్యాప్ చాలెంజ్‌.. సీసా మూత మీరు ఇలా తీయ‌గ‌ల‌రా..?

-

ఈ బాటిల్ క్యాప్ చాలెంజ్‌ను ఎవ‌రు ప్రారంభించారో తెలియ‌దు కానీ.. ప్ర‌ముఖ సింగ‌ర్ జాన్ మేయ‌ర్ ఈ చాలెంజ్ స్వీక‌రించి సీసా మూత తీశాడు. అనంత‌రం దాన్ని త‌న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసి ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు జాస‌న్ స్టాటంకు చాలెంజ్ చేశాడు.

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే ఎన్నో ర‌కాల చాలెంజ్‌లు వ‌చ్చాయి. రైస్ బ‌కెట్ చాలెంజ్‌, ఐస్ బ‌కెట్ చాలెంజ్‌, కికి వీడియో చాలెంజ్‌.. ఇలా ఎంతో మంది ఎన్నో ర‌కాల చాలెంజ్‌ల‌ను వైర‌ల్ చేశారు. అయితే ఇప్పుడు మ‌రొక చాలెంజ్ కూడా సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్ అవుతోంది. అదే.. బాటిల్ క్యాప్ చాలెంజ్‌.. ఇంత‌కీ అస‌లు ఈ బాటిల్ క్యాప్ చాలెంజ్ అంటే.. ఏమిటంటే.. ఏమీ లేదండీ.. ఒక సీసా, లేదా బాటిల్‌ను కొద్దిగా ఎత్తున ప్ర‌దేశంలో ఉంచుతారు. వాటి మూత‌ను లూజుగా ఉంచుతారు. ఆ త‌రువాత ఆ మూత‌కు కాలితో రివ‌ర్స్ కిక్ ఇస్తే అది ఆ బాటిల్ లేదా సీసాను వీడి గింగిరాలు తిరుగుతూ గాల్లోకి లేచి అవ‌తల ప‌డుతుంది.. అంతే..!

అయితే ఈ బాటిల్ క్యాప్ చాలెంజ్‌ను ఎవ‌రు ప్రారంభించారో తెలియ‌దు కానీ.. ప్ర‌ముఖ సింగ‌ర్ జాన్ మేయ‌ర్ ఈ చాలెంజ్ స్వీక‌రించి సీసా మూత తీశాడు. అనంత‌రం దాన్ని త‌న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసి ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు జాస‌న్ స్టాటంకు చాలెంజ్ చేశాడు. దాన్ని స్టాటం స్వీక‌రించి తాను కూడా బాటిల్ క్యాప్ అలాగే తీసి అత‌ను దాన్ని త‌న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశాడు.

అయితే జాస‌న్ స్టాటంకు ఫ్యాన్ అయిన ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ కూడా ఈ చాలెంజ్‌ను స్వీక‌రించి బాటిల్ క్యాప్ తీశాడు. దీంతో అత‌ను కూడా ఆ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడా వీడియో నెట్‌లో వైర‌ల్ అవుతోంది. దీంతో చాలా మంది ఈ చాలెంజ్‌ను స్వీక‌రించి అలా బాటిల్ క్యాప్స్ తీసేందుకు య‌త్నిస్తున్నారు. మరి ఇంకా ఎంద‌రు సెల‌బ్రిటీలు ఇలా చేస్తారో వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news