బ్రేకింగ్ : మహబూబాబాద్ కిడ్నాప్ కేసులో బాబు సేఫ్.. పోలీసులు అదుపులో !

-

మహబూబాబాద్ లో 9 ఏళ్ల బాబు కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేదించారు. బాబు సేఫ్ గా ఉన్నాడని, పోలీసులు అదుపులో కిడ్నాపర్ ఉన్నాడని తెలుస్తోంది. ఆ కుటుంబానికి కిడ్నాపర్ సన్నిహితుడేనని అంటున్నారు. ఈరోజు 11 గంటలు కిడ్నాప్ అయిన బాబును మీడియా ముందు ప్రవశపెట్టనున్నారు పోలీసులు.

ఈ కిడ్నాపర్ నాలుగు రోజులుగా పోలీసులకు చుక్కలు చూపెట్టాడు. ఐటీకోర్, సైబర్ క్రైమ్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినా ఈరోజు ఉదయం దాకా పురోగతి కన్పించలేదు. బాలుడి తల్లిఫోన్ కు కిడ్నాపర్ ని వరుస ఫోన్ల పరంపర కొనసాగింది. డబ్బు మూటతో కిడ్నాపర్లు చెప్పినచోటే నిన్న రాత్రంతా బాలుడి తండ్రి పడిగాపులు కాశారు కూడా. ఇక ఎన్ ఐఏ ను రంగంలోకి దించాలని చూసిన సమయంలో కిడ్నాపర్ జాడ దొరికింది.

Read more RELATED
Recommended to you

Latest news