మీమర్స్ కు బ్రహ్మీ థాంక్స్…!

హాస్యనటుడు బరహ్మానందం రీసెంట్ గా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న మీమ్స్ పై బ్రహ్మీ స్పందించారు. ఇటీవల సినిమాల్లో కనిపించకపోయినా మీమ్ మేకర్స్ తనను రోజూ వార్తల్లో నిలబెడుతున్నారని వ్యాఖ్యానించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మీమ్స్ లేకపోతే తనను ఎవరూ గుర్తుపట్టేవారు కాదని అన్నారు.

ఇదిలా ఉండగా బ్రహ్మీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. జాతి రత్నాలు సినిమాలు కనిపించిన బ్రహ్మీ ఆ తరవాత మళ్లీ కనిపించలేదు. వయసు పైన పడటం తో బ్రహ్మీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. అంతే కాకుండా తనకు ఉన్న పెయింటింగ్ కళను ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే బ్రహ్మీ ఓ పెయింటింగ్ వేసి దానిని రెబల్ స్టార్ కృష్ణం రాజు కు ఇచ్చారు.