అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం…

-

వరస భూకంపాలు దేశ వాసులను కలవరపరుస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో హిమాలయ రిజియన్ రాష్ట్రాలతో పాటు అండమాన నికోబార్ దీవుల్లో కూడా భూకంపాలు తరుచుగా సంభవిస్తున్నాయి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టాలు లేకపోవడం సంతోషకర విషయం. అయితే భూకంప తీవ్రత కారణంగా జనాల్లో భయాలు మాత్రం ఏర్పడుతున్నాయి. మిజోరాం, అస్సాం రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఎక్కువగా భూకంపాలు నమోదయ్యాయి.

తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. కాంప్ బెల్ బే కు ఈశాన్య దిశన భూకంపం సంబవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర కేంద్రీక్రుతం అయిందని తెలిపింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4 గా నమోదైంది. భూకంపం ధాటికి స్థానికంగా ఉన్న భూమి ప్రకంపనలకు లోనైంది.

Read more RELATED
Recommended to you

Latest news