వావీ వరసలు మరిచి అత్యంత దారణానికి పాల్పడ్డ కామాంధుడికి మరణ శిక్ష విధించింది కోర్ట్. కంటికిరెప్పలా కాపాడాల్సిన తండ్రే సొంత కూతురుపైనే అత్యాచారానికి పాల్పడటాన్ని తీవ్రమైన తప్పుగా భావించింది కోర్ట్. కూతరుకు పెళ్లి చేసినా.. కూడా ఆ కామాంధ తండ్రి ఆమెను వదిలిపెట్టలేదు. తప్పు బయటపడటంతో విషయం కోర్ట్ కు చేరడంతో తండ్రికి మరణిశిక్ష విధించింది.
వివరాల్లోకి వెళితే… ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. తన మైనర్ కూతురిపై అత్యాచారం చేసిన 40 ఏళ్ల కీచక తండ్రికి మరణశిక్ష విధిస్తూ బహ్రైచ్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సంఘటన వెలుగులోకి వచ్చిన మూడు నెలలతోనే కామాంధుడైన తండ్రిని దోషిగా తేలుస్తూ అదనపు సెషన్స్ జడ్జి నితిన్ కుమార్ పాండే శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
14 ఏళ్ల కూతరుకు పెళ్లి చేశాక కూడా తండ్రి వదిలి పెట్టలేదు. ఇంటికి తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దురాగతం గత రెండేళ్లుగా సాగుతోంది. అయితే కూతురును బెదిరించడంతో విషయాన్ని బయటకు చెప్పలేకపోయింది. ఇటీవల తండ్రి అత్యాాచారం చేస్తుండగా బాలిక భర్త పట్టుకుని కేసు పెట్టాడు. బాధితురాలితోపాటు ఆమె కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.దోషికి మరణశిక్షతోపాటు 51వేలరూపాయల జరిమానా కూడా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.