ట్రెండ్‌ అవుతున్న బ్రాట్‌ డైట్.. అసలు పిల్లలతో చేయించవచ్చా..?

-

పిల్లల ఆరోగ్యం మీద తల్లితండ్రులకు ఎప్పుడు బెంగే ఉంటుంది.. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఎన్నో సమస్యలు.. మలబద్ధకం, డయేరియా, కంటిచూపు ఇవన్నీ ఉంటాయి.. అయితే ఇప్పుడు బ్రాట్‌ డైట్‌ ఒకటి బాగా వినిపిస్తోంది. పిల్లలు అనారోగ్యం భారిన పడితే..వైద్యులు ఈ డైట్‌నే ఎక్కువ సూచిస్తున్నారు. అసలు ఏంటి ఈ బ్రాట్ డైట్? ఇది పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారా? ఎన్ని రోజులు పాటించాలి..?

బ్రాట్ అంటే ఏంటి?

BRAT అంటే అరటిపండు(Banana), అన్నం(Rice), యాపిల్ సాస్(Apple Sauce), టోస్ట్(Toast). ఇది చప్పగా ఉండే ఆహారం. కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ బ్రాట్ డైట్ ఫాలో పాటిస్తారు..విరోచనాలు అయినప్పుడు ఎక్కువగా దీన్ని ఫాలో అవుతారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రజాదరణ పొందిన ఆహారం ఇది. అయితే ఇది ఎక్కువ రోజులు ఈ డైట్ పాటించడం కష్టం.. చప్పగా ఉండటుంది కదా తినలేరు.

ఈ ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. పొట్టకి సున్నితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆహారంలో చేర్చిన పదార్థాల్లో కొవ్వులు, ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. ఇవి పొట్టకు ఎక్కువ భారం అనిపించవు. ఇది తీసుకోవడం వల్ల పొట్టలో ఎటువంటి చికాకు లక్షణాలు ఉండవు. అంతే కాదు ఈ బ్రాట్ ఆహారం వికారాన్ని తగ్గిస్తుందని డైటీషియన్లు చెప్తున్నారు.

బ్రాట్‌లో వీటిని కూడా జోడించవచ్చు..

కేవలం నాలుగు పదార్థాలతో ఉండే ఈ డైట్ బోరింగ్ అనిపిస్తే.. వాటిలో పెరుగు కలుపుకోవడం వల్ల ప్రోబయాటిక్స్ అందుతాయి. ఇవి గట్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. డయేరియా లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉడికించిన బంగాళాదుంపలు, ఉడికించిన క్యారెట్లు, పుచ్చకాయ, యాపిల్ జ్యూస్, కొబ్బరి నీళ్ళు కూడా బ్రాట్ డైట్ లో తీసుకోవచ్చు.

పెద్దవాళ్ళు ఈ డైట్ ఫాలో అవొచ్చా?

ఇది ఎక్కువగా పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రమే పాటిస్తారు. పెద్దలు కూడా వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నప్పుడు బ్రాట్ డైట్ ని అనుసరించవచ్చట… అయితే విటమిన్లు, ఇతర పోషకాలు లేని కారణంగా ఈ ఆహారాన్ని దీర్ఘకాలం పాటు మాత్రం ఫాలో అవకూడదు.. పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి సాధారణ ఆహారం తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎన్ని రోజులు పాటించాలి?

అతిసారంతో బాధపడుతున్న పిల్లలకి ఈ డైట్ ఎక్కువ రోజులు పాటించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణుల భావన. ఎందుకంటే ఇందులో ఫైబర్, పోషకాలు, ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయి. అయితే అప్పుడప్పుడు బ్రాట్ డైట్ ఫాలో అవడం పెద్దలు, పిల్లలు అందరికీ మంచిదే. బ్రాట్ ఆహారం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే పాటించాలి.. బరువు తగ్గడం కోసం కొంతమంది ఈ డైట్ ఫాలో అవుతూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు.. అందులో కాల్షియం, విటమిన్ బి 12, ప్రోటీన్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు బ్రాట్ ఆహారంలో ఉండవు. అందుకే ఎక్కువ రోజులు కొనసాగించడం మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version