బాలికల వసతి గృహంలో నిబంధనలకు విరుద్ధంగా పురుష వంటమనిషిని నియమించారు. ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని ఏ- పవర్ హౌస్ బస్తీలో ఉన్న గిరిజన బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వాస్తవానికి బాలిక వసతి గృహంలో మహిళా వంటమనిషి ఉండాలి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో నియమించాల్సి వస్తే 50 ఏళ్లకు పైబడిన పురుష వంటమనిషి నియమించాలి.
కానీ, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఒక యువకుడిని వంటమనిషిగా నియమించారు.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. పదో తరగతి పాసై, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ వంటి పలు కోర్సులలో విద్యను అభ్యసిస్తూ వసతి గృహంలో ఉంటున్న బాలికల హాస్టల్‌లో సిబ్బంది మహిళలే ఉండాలి. కానీ, రూల్స్‌కు విరుద్ధంగా అధికారులు ఒక యువకుడిని వంట మనిషిగా నియమించారు. అతడు కూడా బాలికల హాస్టల్‌లోనే నివాసం ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బాలికల హాస్టల్‌లోకి పురుషులు ప్రవేశించడం నిషేధం. అలాంటిది ఏకంగా ఒక యువకుడిని వంట మాస్టర్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నేతలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.