నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు అమలులో ఉంటాయని సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక సూచనలు చేశారు. వేడుకలు ఈనెల 31వ తేదీ ఒంటి గంట వరకే చేసుకోవాలని తెలిపాడు. పబ్బులు మరియు రెస్టారెంట్లు పది రోజుల ముందే అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఈవెంట్ లో సిసి టీవీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ గార్డ్ కూడా ఉండాలని స్పష్టం చేశారు. కెపాసిటీకి మించి పాసులు జారీ చేయవద్దని అలాగే అనుమతి లేకుండా లిక్కర్ సరఫరా చేయొద్దని చెప్పాడు.అశ్లీల నృత్యం అనుమతి లేదు. 45 డేసిబిల్స్ శబ్దం కంటే ఎక్కువ శబ్దం చేయరాదు.
ఈ వేడుకల్లో మైనర్లకు అనుమతి లేదని ఒకవేళ డ్రగ్స్ ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే కఠిన చర్యలు ఉంటాయని సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్యలు కలిగించకూడదని చెప్పాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే 10,000 జరిమానా విధిస్తామని లేకపోతే ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించాడు. అలా కాకపోతే వాహనందారుని యొక్క డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని సిపి తెలిపారు.