తెలంగాణలో కొత్త ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. అన్ని శాఖల అధికారులతో మంత్రులందరూ వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితి తెలుసుకున్నారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు.
తప్పులు సరి చేసేందుకు ప్రతి ఊళ్లో గ్రామసభ నిర్వహిస్తామన్నారు. ఆ గ్రామ సభల్లోనే పెన్షన్లు, ఇండ్ల మంజూరు, రేషన్ కార్డు లబ్దిదారులను ఎంపిక చేస్తామని ప్రకటించారు. అంతేకాదు.. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా పంపిణీ చేయకపోవడంతో.. ఈ ప్రభుత్వంలో తొలుత రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేయడం చాలా శుభ పరిణామం అని పలువురు చర్చించుకుంటున్నారు. డిసెంబర్ 28 నుంచి రేషన్ కార్డుల ప్రక్రియ ఏవిధంగా ఉంటుందో చూడాలి మరీ.