బ్రేకింగ్: హైదరాబాద్ పర్యటనకు అమిత్ షా

హైదరాబాద్ పర్యటనకు కేంద్ర హోం శాఖా మంత్రి, బిజెపి సీనియర్ నేత అమిత్ షా రానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ కి సంబంధించి వార్తలు వస్తున్నాయి. ఈ నెల మూడో వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉండవచ్చు. ఎన్నికల నిర్వహణ వచ్చే నెల ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో పార్టీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు.

గ్రేటర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా ఆయన పలు సూచనలు చేయనున్నారు. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి అమిత్ షా పార్టీ నేతలతో చర్చిస్తారు. పార్టీలో ఉన్న లోపాల పరిష్కారానికి ఆయన పలు సూచనలు చేయనున్నారు. అలాగే పార్టీ ప్రచార విధానాలపై కూడా ఆయన నేతలతో చర్చిస్తారు. కేంద్ర ప్రభుత్వ నిధుల అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళే విధంగా ఆయన సూచనలు చేస్తారు. అయితే పర్యటన తేదీ ఎప్పుడు అనేది స్పష్టత లేదు.