కరోనా సెకండ్ వేవ్ : మళ్ళీ రైళ్ళ రద్దు !

-

దేశంలో కరోనా కేసులు నెమ్మదిగా మళ్లీ విజృంభిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ అనే టెన్షన్ అన్ని చోట్లా మొదలైంది. ప్రస్తుతానికైతే ప్రభుత్వాలు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తగా కఠిన నిర్ణయాలు అమలు చేస్తూ కూడా వస్తున్నాయి. ప్రతి ఏడాది ఘనంగా జరుపుకునే దీపావళిని సైతం ఈ సారి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాయంటే కరోనా గురించి ఎంతగా భయపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ఈ కరోనా సెకండ్ వేవ్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి దాకా రైళ్లు నడిపిన రైల్వే శాఖ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశం మొత్తం మీద 12 రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అది కూడా దక్షిణ మధ్య రైల్వేలో పరిధిలోనే ఈ అన్ని రైళ్ళు రద్దు కావడం గమనార్హం. దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం- విజయవాడ- విశాఖపట్నం, నాందేడ్- పాన్వెల్- నాందేడ్, ధర్మాబాద్‌- మన్మాడ్- ధర్మాబాద్, తిరుపతి- కొల్హాపూర్- తిరుపతి, కాచిగూడ- నార్కేర్- కాచిగూడ, కాచిగూడ- అకోలా-కాచిగూడ రైళ్ళను రద్దు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news