బ్రేకింగ్: వారం రోజుల్లో మోస్ట్ వాంటెడ్ ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

ఇటీవల కడప జిల్లా శివారుల్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు. ఈ ప్రమాదంలో నలుగురు స్మగ్లర్లు సజీవ దహనం అయ్యారు. ఈ కేసు విచారణలో భాగంగా వారం రోజుల్లో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. అంతర్ రాష్ట్ర ఎర్రచందనం బడా స్మగ్లర్ బాషా భాయ్ ఉన్నాడు.

బెంగళూరులో అతను నివాసం ఉంటున్నాడు అని, తప్పించుకుని తిరుగుతున్నాడు అని కడప పోలీసులు గుర్తు చేసారు. అక్కడి నుంచి అతని కోసం గాలించారు. నాలుగు రోజుల క్రితం వల్లూరు మండలం గోటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన లోకల్ హైజాక్ గ్యాంగ్ కు అతనే దర్శకత్వం ఇచ్చాడు. కడప, రాయచోటి, పెండ్లిమర్రి మండలాలకు చెందిన ముగ్గురు హైజాక్ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసారు.