ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి… నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని సాగనంపడానికి గాను అధికార వైసీపీ రంగం సిద్దం చేసింది. ఈ మేరకు ఒక ఆర్డినెన్స్ ని తీసుకొచ్చే ఆలోచనలో జగన్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తుంది. హైకోర్ట్ జడ్జి స్థాయి అధికారిని ఆ పదవిలో నియమించడానికి జగన్ సర్కార్ సిద్దమైనట్టు వార్తలు వస్తున్నాయి. రమేష్ కుమార్ ని ఎలా అయినా సరే తప్పించాలని స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా…
వేసిన నాటి నుంచి కూడా జగన్ సర్కార్ అనేక విధాలుగా కష్టపడుతూ వస్తుంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆయన్ను తప్పించడానికి గానూ… ఒక ఆర్డినెన్స్ గవర్నర్ వద్దకు కూడా పంపారు. ఎన్నికల కమీషనర్ అర్హతను పూర్తిగా మార్చడమే కాకుండా ఆయన పదవి కాలం మూడేళ్ళ కు కుదిస్తూ కూడా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.
ఆ ఆర్డినెన్స్ ని గవర్నర్ ఆమోదిస్తే మాత్రం… ఆయన్ను మార్చే అధికారం జగన్ సర్కార్ కి ఉంటుంది. దీని మీద గవర్నర్ తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను రమేష్ కుమార్ వాయిదా వేసారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆయన చంద్రబాబు సామాజిక వర్గం కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు సిఎం జగన్.