బ్రేకింగ్; ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, రిజర్వేషన్లు తగ్గించిన జగన్ సర్కార్…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. 50 శాతంకి మించి రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీం కోర్ట్ గతంలో ఆదేశాలు ఇచ్చిన మేరకే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కోసమని 59.85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావించింది. దీనిపై సుప్రీం కోర్ట్ లో హైకోర్ట్ లో పిటీషన్లు దాఖలు అయ్యాయి.

ఈ మేరకు శుక్రవారం తీర్పు ఇచ్చింది ఏపీ హైకోర్ట్. సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం రిజర్వేషన్ లు 50 శాతం దాటకూడదు అని తీర్పు ఇచ్చింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరితో ఆయన చర్చలు జరిపి కీలక నిర్ణయ౦ తీసుకున్నారు. పైన ఉన్న 9 శాతంపైగా ఉన్న రిజర్వేషన్లను తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నారు.

బీసీలకు 24.15 శాతం, ఎస్సీ ఎస్టీలకు 19.08, 6.77 రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తున్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం ఖరారు చేస్తుంది ప్రభుత్వం. ప్రస్తుతం మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు తగ్గించాలని నిర్ణయించారు. గతంలో ఇచ్చిన జీవో ప్రకారం 34 శాతం కి పైగా రిజర్వేషన్ లు ఉన్నాయి. మరి దీనిపై విపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయి అనేది చూడాలి. రెండు రోజుల్లో నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news