గడిచిన కొంతకాలం నుండి రైళ్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలోనూ ఘోరమై రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. రైళ్లకు సెపరేట్ గా ట్రాక్ లు ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనే విషయం పట్ల ప్రభుత్వాలు ఆయా శాఖల అధికారులు ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ లో ఒక ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది. ఢాకా సమీపంలోని రెండు రైళ్లు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలియచేశారు. ముదుఘా ఒక రైలు ప్రయాణికులతో వెళుతుండగా , వెనక నుండి అదే ట్రాక్ లో వస్తున్న మరో గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ఈ ఘటన సంభవించింది.
ఈ ఘటనలో క్లియర్ గా కంట్రోలింగ్ ఇష్యూ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించగా, 100 మంది వరకు గాయపడ్డారు. అసలు ఈ ఘటనకు ప్రధాన కారణం ఏమిటన్నది అధికారుల నుండి తెలియాల్సి ఉంది.