జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆయన గవర్నర్‌కు అందజేశారు.
కాగా, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ భూ కుంభ కోణం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జేఎంఎంలో కీలక నేతగా ఉన్న చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, భూ కుంభకోణం కేసులో బెయిల్ రావడంతో హేమంత్ సోరెన్ ఇటీవల బయటకు వచ్చారు.ఈ క్రమంలోనే బుధవారం నిర్వహించిన జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేల సమావేశంలో హేమంత్ సోరేన్ ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని హేమంత్ సోరెన్ కోరారు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి గవర్నర్ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ మరోసారి బాధ్యతలు చేపడుతారు.