బ్రేకింగ్ : చంద్రబాబు బెయిల్ కేసులో కోర్ట్ కీలక నిర్ణయం!

హై కోర్ట్ లో రెండు రోజుల నుండి విచారణలో ఉన్న చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసు యొక్క బెయిల్ పై కీలకమైన అప్డేట్ వచ్చింది. నిన్న జరిగిన విచారణలో చంద్రబాబు తరపున లాయర్ సిద్దార్ధ్ లూథ్రా కోర్టుకు ఎందుకు బెయిల్ ఇవ్వాలో ఆరోగ్య సమస్యలపై పలు రిపోర్ట్ లను ఇవ్వడం జరిగింది. ఇక ఈ రోజు ఎఎజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని, రిపోర్ట్స్ అన్నీ కూడా నిజం కాదని కోర్టుకు తెలియచేసే ప్రయత్నం చేశాడు. ఇరు పక్షాల వాదనలను విన్న హై కోర్ట్ ఈ కేసులో తీర్పును రిజర్వు చేసినట్లు వెలువడించింది. ఇప్పుడు ఆ బెయిల్ లో ఏమని తీర్పును ఇస్తుంది ? రిజర్వు చేసిన తీర్పును ఎప్పుడు బయటపెడుతుంది అన్న వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Big shock for Chandrababu in AP High Court

హై కోర్ట్ తీర్పును రిజర్వు లో పెట్టిందంటే.. దాని మీద లోతుగా అధ్యయనం చేస్తున్నది అని అర్ధం అంటూ ఈ మధ్యన కొందరు న్యాయ నిపుణులు మీడియా ముఖ్యంగా చెబుతున్నారు.