కర్నాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్రకు చెందిన ఓ వీడియో వైరల్ అవుతోంది. తాను పంపిన లిస్టుకు చెందిన వ్యక్తుల గురించి పనిచేయాలని ఫోన్‌లో తన తండ్రికి యతీంద్ర ఆదేశించారు. ఓ మీటింగ్‌లో జనం మధ్య ఉన్న సమయంలోనే ఆ వీడియో రికార్డు జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. తీవ్ర వివాదానికి దారి తీసింది.
రాష్ట్రంలో క్యాష్ ఫర్ పోస్టింగ్ స్కామ్ నడుస్తోందని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. ఎటువంటి భయం లేకుండా ఆ అవినీతి చోటుచేసుకుంటున్నట్లు ఆయన అన్నారు. దానికి సాక్ష్యం ఈ వీడియోనే అని తెలిపారు. సీఎం ఆఫీసు కలెక్షన్ కేంద్రంగా మారిందని కుమారస్వామిఅన్నారు. సీఎం సిద్దరామయ్య కుమారుడు కలెక్షన్లకు రాకుమారుడిగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ట్రాన్స్‌ఫర్ మాఫియా నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. పబ్లిక్‌గానే అవినీతి చోటుచేసుకుంటే, ఇక నాలుగు గోడల మధ్య ఏ రేంజ్‌లో ఉంటుందో ఆలోచించాలన్నారు.