BREAKING: ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన ‘కలర్ ఫోటో ‘..

-

నేషనల్ ఉత్తమ చిత్రం అవార్డు లలో తెలుగు సినిమాలు సత్తాను ఛాటాయి.ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్‌ ఫోటో’ ఎంపికైంది. అలాగే ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్‌ విభాగాల్లో ‘నాట్యం’, ఉత్తమ సంగీత చిత్రంగా ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి..

జూలై 22 శుక్రవారం 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ నటుడిగా అవార్డును ఇద్దరు పంచుకోనున్నారు. సూరారైపోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా)లోనటనకు గానూ సూర్య, తానాజీలో నటనకు అజయ్‌ దేవగణ్‌లు ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు.ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళి (సూరారైపోట్రు)ని అవార్డు వరించింది. ఈ ఏడాది మొత్తం 30 భాషల్లో 305 ఫీచర్‌ ఫిల్మ్స్‌ ఎంట్రీకి వచ్చాయి.

అదే విధంగా.. నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్ కేటరిగిలో 148 చిత్రాలు (20 భాషల్లో )స్క్రీనింగ్‌ వచ్చినట్లు జ్యూరీ మెంబర్స్‌ తెలిపారు. ఈ ఏడాది అవార్డులను ఐదు కేటగిరీలుగా విభజించారు. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు, ఫీచర్‌ ఫిల్మ్‌ (28 కేటగిరీలు), నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ (22 కేటగిరీలు), బెస్ట్‌ రైటింగ్‌ సెక్షన్‌, మోస్ట్‌ ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌ కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు..

జాతీయ అవార్డు లలో ఎంపికైన వాళ్ళు..

*. ఉత్తమ నటి అపర్ణ బాలమురళి (సూరారై పోట్రు)

* ఉత్తమ చిత్రం :సూరారై పోట్రు (సుధాకొంగర)

ఉత్తమ దర్శకుడు: దివంగత సచ్చిదానందన్‌ (అయ్యప్పనుమ్‌ కోషియుం)

* ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివ రంజనీయం ఇన్నుమ్‌ సిలా పెంగళం)

*. ఉత్తమ నటుడు: సూర్య (సూరారై పోట్రు), అజయ్‌ దేవ్‌గణ్‌ (తానాజీ)

*. ఉత్తమ సహాయ నటుడు: బిజూ మేనన్‌ (అయ్యప్పనుమ్‌ కోషియుం)..

Read more RELATED
Recommended to you

Latest news