చిరంజీవికి ‘మెగాస్టార్’ అనే టైటిల్ ఇచ్చిందెవరో మీకు తెలుసా?

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. ఇండస్ట్రీ పెద్దగా మాత్రమే కాకుండా ఆపద వస్తే ఆదుకునేందుకు ముందు వచ్చే బిడ్డగా ఆయన కొనసాగుతున్నారు. కాగా, చిరంజీవికి ‘మెగాస్టార్’ అనే టైటిల్ ఎవరు ఇచ్చారు? దాని వెనుక ఉన్న స్టోరి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చిరంజీవి..‘పునాది రాళ్లు’ అనే పిక్చర్ తన సినీ కెరీర్ స్టార్ట్ చేశారు. ‘సుప్రీమ్’ హీరో అనే టైటిల్ తో అనే పేరు తొలుత వెండితెరపైన కనబడేది. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ టైటిల్ ను అలానే మేకర్స్ వేశారు.

ఈ క్రమంలోనే చిరంజీవి ..టాలీవుడ్ ప్రొడ్యూసర్ కే.ఎస్.రామారావుతో ‘అభిలాష’ అనే చిత్రం చేశారు. అది సూపర్ హిట్ అయింది. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా వచ్చిన ఈ పిక్చర్ సూపర్ హిట్ కాగా, ఈ పిక్చర్ కు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. సేమ్ కాంబినేషన్ లో రెండో పిక్చర్ ‘ఛాలెంజ్’ వచ్చింది. ఇది కూడా సూపర్ హిట్ అయింది. అలా హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రాక్షసుడు’ కూడా వచ్చింది.

ఇక వీరి కాంబోలో వచ్చిన నాల్గో పిక్చర్ ‘మరణ మృదంగం’ ఈ ఫిల్మ్ టైటిల్స్ లోనే తొలిసారి చిరంజీవి పేరు ‘మెగాస్టార్’ చిరంజీవి అని వస్తుంది.అలా ఆ చిత్రం నుంచి చిరు..మెగాస్టార్ అయిపోయారు. వీరి కాంబోలో వచ్చిన ఐదో పిక్చర్ ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా, త్వరలో వీరి కాంబోలో ఆరో పిక్చర్ రాబోతున్నది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాను కే.ఎస్.రామారావు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో కథానాయికగా తమన్నా భాటియా నటిస్తుండగా, చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news