మంత్రి కొడాలి నానీపై విజయవాడ కమీషనర్ కి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేసారు. విజయవాడ సీపీని కలిసిన టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు… మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై సీపీకి ఫిర్యాదు చేసారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ… కొడాలి నాని వాడుతున్న భాష అప్రజాస్వామికమని అన్నారు. నాని భాషను చూసి ఆయన కుటుంబ సభ్యులు సిగ్గుతో తలదించుకుంటారని ఆరోపించారు.
ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని ప్రశ్నిస్తే చంపేస్తారా ? అని నిలదీశారు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా నన్ను కూడా చంపేస్తారా ? అని ప్రశ్నించారు. ఆయన భూతులు చూసి ఎవరూ ఆయన దగ్గరకి కూడా రావటం లేదన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటారేమో అని చూశాం కానీ స్పందించలేదని… డిజిపి బిజిగా ఉన్నానంటే సీపీ ని కలిసి ఫిర్యాదు చేశామని అన్నారు. పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోవాలి లేనిపక్షంలో గవర్నర్ ని కూడా కలుస్తామని అన్నారు.