బ్రేకింగ్: వెబ్ సీరీస్ కి కోర్ట్ బ్రేక్

-

‘బ్యాడ్ బాయ్ బిలినియర్ ‘ పేరుతో ఈ వారంలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కావాల్సిన వెబ్ సిరీస్ కు సిటీ సివిల్ కోర్టు బ్రేక్ వేసింది. తన జీవిత చరిత్ర చిత్రీకరించారన్న అనుమానాలు ఉన్నాయని దీని నిలిపివేయాలని కోర్ట్ ను సత్యం రామలింగ రాజు ఆశ్రయించారు. సత్యం రామ లింగరాజు తరుపున వాదించిన నిరంజన్ రెడ్డి… సత్యం రామ లింగరాజు తరుపున తన వాదనను బలంగా వినిపించారు.

సత్యం కుంభకోణం కేస్ లో కోర్ట్ 7 సంవత్సరాలు జైల్ శిక్ష విధించారు. దీని పై కోర్ట్ లో రామలింగ రాజు అపీల్ చేసిన విషయం కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు నిరంజన్ రెడ్డి. కేస్ కోర్ట్ లో పెండింగ్ లో ఉండగా తన జీవిత చరిత్ర గురించి తీస్తునారని అనుమానం ఉన్న ఈ వెబ్ సిరీస్ ను నిలిపివేయాలని పిటీషన ర్ వాదనలు వినిపించారు. పిట్టీషన ర్ వాదనతో ఏకి భవించిన సిటీ సివిల్ కోర్టు… బ్యాడ్ బాయ్ బిలినియర్ వెబ్ సిరీస్ ను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version