BREAKING: తెలంగాణాలో డిఎస్సి పరీక్షలు వాయిదా !

-

ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అయిదు రాష్ట్రాలలో ఎన్నికలను జరిపించడానికి షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రభావం డిఎస్సి పరీక్షలపై పడింది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణాలో నవంబర్ 20 నుండి 30 వరకు జరగనున్న ఉపాధ్యాయ భర్తీ పరీక్షలను వాయిదా వేస్తూ పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీ దేవసేన ప్రకటించారు. ఈ డిఎస్సి లో మొత్తం 5089 టీచర్ పోస్ట్ లను భర్తీ చేయనుండగా, ఇంతలో ఎన్నికలు ప్రకటించడంతో వాయిదా వేశారు. తదుపరి ఎప్పుడు ప్రభుత్వం డీఎస్సీ ని జరపనుంది అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇక గ్రూప్ 2 పరీక్షలను కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మరికొన్ని రోజులు సమయం దొరికినందున సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version