తెలంగాణలో పలు చోట్ల భూమి కంపించింది. కరీంనగర్ మంచిర్యాల జిల్లాలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మంచిర్యాల జిల్లాలోని చున్నం బట్టి వాడ, శ్రీ శ్రీ నగర్, సీతారాం పల్లి, నస్పూర్, సీతారాంపూర్ ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కనిపించింది. అదేవిధంగా పెద్దపల్లి లోనూ భూమి కంపించినట్టయిందని తెలుస్తోంది. కరీంనగర్ లోనూ భూమి కనిపించిందని సమాచారం అందుతోంది. ఈ ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
ఇంటి నుండి బయటకు పరుగులు తీశారు. కరీంనగర్ జిల్లాలో లో లేఖిని పై తీవ్రత 4 గా నమోదయింద కరీంనగర్ కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ను అధికారులు గుర్తించినట్టు సమాచారం. పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకోవడం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఇదేవిధంగా భూమి కంపించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా నల్గొండ జిల్లాలోనూ ఇటీవల భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.