ఒక పక్క కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతున్న దేశ రాజధాని ఢిల్లీని భూకంపం వణికించింది. ఇప్పటికే కరోనా కేసులు పెరగడంతో బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న ప్రజలను భూ ప్రకంపనలు మరింతగా భయపెట్టి బయటకు పరుగులు తీయించాయి. ఆదివారం సాయంత్రం ఢిల్లీ లో ఢిల్లీ-ఎన్‌ఆర్సీ ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. వెంటనే ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు వచ్చేశారు.
రిక్టర్ స్కేలుపై భూ ప్రకంపనలు 3.5గా నమోదు కాగా… ఈ ప్రకంపనల్లో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు. అయితే కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి అంటున్నారు. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు ఎవరూ కంగారు పడవద్దని సూచించింది. పరిస్థితి ఇబ్బందికరంగా లేదని అనవసరంగా కంగారు పడి రోడ్ల మీదకు రావొద్దని సామాజిక దూరం పాటించాలని ప్రజలను అధికారులు కోరుతున్నారు.