BREAKING: విద్యాశాఖ కీలక నిర్ణయం.. సంవత్సరానికి రెండు సార్లు టెట్ పరీక్ష

-

TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంవత్సరానికి 2 సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. జూన్, డిసెంబర్ నెలల్లో టెట్ పరీక్ష నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒక అభ్యర్థి ఎన్ని సార్లైనా టెట్ రాసుకోవచ్చని జీవోలో పేర్కొంది. డీఎస్సీలో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది.

ఇదిలా ఉంటే…  షెడ్యూల్‌ ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు వెంటవెంటనే ఉన్నాయి. అయితే ఇవి రెండూ ఒకదాని వెంటే మరొకటి నిర్వహిస్తుండడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. డీఎస్సీని సెప్టెంబర్‌లో నిర్వహించాలని అభ్యర్థులు గతకొంతకాలంగా డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. శుక్రవారం నాడు డీఎస్సీ వాయిదా, గ్రూప్‌-1 మెయిన్స్‌తోపాటు పలు సమస్యల పరిష్కారానికి నిరుద్యోగులు టీఎస్‌పీఎస్సీ ముట్టడించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news