BREAKING : క్రికెట్ చరిత్రలోనే ఇలా జరగడం మొదటిసారి!

-

ఈ రోజు ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం లో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక మరియు బంగ్లాదేశ్ లు పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ కు మరియు సెమీఫైనల్ రేస్ కు ఏ విధమైన సంబంధం లేనందున ఎవ్వరూ ఈ మ్యాచ్ ను పట్టించుకోవడం లేదని చెప్పాలి. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, శ్రీలంక తడబడుతూనే ఆడుతోంది.. ఇన్నింగ్స్ 25వ ఓవర్ లో ఒక అద్భుతం జరిగింది.. షకీబ్ ఆల్ హాసన్ వేసిన ఆ ఓవర్ లో రెండవ బంతికి సమరవిక్రమ ను అవుట్ చేశాడు. ఆ తర్వాత బ్యాట్స్మన్ గా సీనియర్ ఆటగాడు మ్యాత్యుస్ క్రీజులో రావాల్సి ఉంది. అతను చాలా నెమ్మదిగా వచ్చి కనీసం క్రీజులోకి కూడా వెళ్లకుండానే పార్టనర్ తో మాట్లాడుతూ ఆ తర్వాత హెల్మెట్ ను తలపై పెట్టుకోగా అది చాలా చిన్నది కావడంతో, డగ్ అవుట్ వైపు మరో హెల్మెట్ కోసం సిగ్నల్ ఇచ్చాడు. దీనితో మ్యాత్యుస్ అంటరాజాతీయ రూల్ ప్రకారం అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాట్స్మన్ మూడు నిముషాల్లో క్రీజులోకి రావాలి.

ఇలా సమయం వృధా కావడంతో షకీబ్ టైం అవుట్ అప్పీల్ తో యంపైర్లు అవుట్ గా ప్రకటించారు. ఇలా అవుట్ అయిన మొదటి క్రికెటర్ గా మ్యాత్యుస్ రికార్డు సృష్టించాడు.

Read more RELATED
Recommended to you

Latest news