BREAKING :అక్కినేని నాగార్జున ఇంట తీవ్ర విషాదం…!

-

టాలీవుడ్ మన్మధుడు యువసామ్రాట్ నాగార్జున ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగేశ్వరరావు కూతురు మరియు నాగార్జున సోదరి నాగ సరోజ అనంతలోకాలకు వెళ్లిపోయారు. వాస్తవంగా ఈ వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈమె మరణించించి నిన్ననే అని తెలుస్తోంది. నాగార్జున నుండి అందుతున్న సమాచారం మేరకు నాగ సరోజ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారట. అయినా చికిత్స తీసుకుంటూ ముంబైలోని తన నివాసంలో ఉంటున్నారు. ఇక భూమి మీద పని లేదు అనుకున్నారో ఏమో కానీ నిన్న అందరినీ వదిలేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వార్త నాగార్జున ఇంట్లో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. కాగా నాగేశ్వరరావు కు మొత్తం అయిదు మంది సంతానం అన్న విషయం తెలిసిందే.

వీరిలో సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ, వెంకట్ మరియు నాగార్జున లు ఉన్నారు. నిజంగా ఈ లోటును నాగార్జున మరియు అతని ఫామిలీ కి ఎవ్వరూ తీర్చలేనిది అని చెప్పాలి. సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు నాగార్జునకు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version