BREAKING NEWS: ప్రభాస్ “సలార్” ట్రైలర్ విడుదల… !

-

ఇండియాలో ఉన్న కోట్లాదిమంది ప్రభాస్ అభిమానులు అంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు ప్రభాస్ ల కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ “సలార్” కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అభిమానులకు పూనకాలు తెస్తోందని చెప్పాలి. కాసేపటి క్రితమే మూవీ యూనిట్ సలార్ ట్రైలర్ ను విడుదల చేసింది.. ఈ ట్రైలర్ ను మేకర్స్ 3 నిముషాల 46 సెకనుల నిడివితో కట్ చేసి ఎంతగానో ఆకట్టుకున్నారు అని చెప్పాలి. ఈ ట్రైలర్ ను చూస్తుంటే ఇక సినిమా ఏ విధంగా ఉందేమోనన్న ఉత్సుకత పెరిగిపోతోంది. ఈ ట్రైలర్ లో మేకర్స్ ముఖ్యంగా ప్రభాస్ లుక్, యాక్షన్ సెక్వెన్సు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లపై ఫోకస్ చేసి విడుదల చేశారు.

ఇందులో ప్రభాస్ తో పాటుగా పృథివీ రాజ్ సుకుమారం, జగపతి బాబు మరియు శృతిహాసన్ లాంటి నటులు ఉండడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాను డిసెంబర్ 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థీయేటర్ లలో విడుదల చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news