ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్ అనంతరం ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీసీసీఐ సెలెక్టర్లు టీ 20, వన్ డే మరియు టెస్ట్ లకు గానూ ముగ్గురు సారధులను జట్టు సభ్యులను ఎంపిక చేసింది. ఈ ఎంపిక గురించి మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన యొక్క అభిప్రాయాన్ని తెలియచేశారు.. లెగ్ స్పిన్నర్ యజవేంద్ర చాహల్ ను టీ20 లకు ఎంపిక చేయకపోవడం పై సెటైర్లు వేయడమే ఇప్పుడు క్రీడా లోకంలో వైరల్ గా మారింది. హర్భజన్ కామెంట్స్ ప్రకారం చాహల్ టీ20 ల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పుడు, అతన్ని అందులో కాకుండా వన్ డే లకు ఎంపిక చేయడం పట్ల ఉపయోగం ఏమిటంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో సెలెక్టర్లు చాహల్ కు లాలీపాప్ చేతిలో పెట్టారంటూ హర్భజన్ కామెంట్ చేశారు.
ఈ వ్యాఖ్యలకు నీతిజ్ఞలు ఇటీవల వరల్డ్ కప్ తో పాటు కొని సిరీస్ లకు ఎంపిక చేయకపోవడం కన్నా ఇది చాలా బెటర్ అంటూ హర్భజన్ కు కౌంటర్ ఇస్తున్నారు. ఇందులో తాను రాణించి ఆకట్టుకుంటే అప్పుడు అన్ని ఫార్మాట్ లలోనూ అవకాశం దక్కుతుందన్నారు.