గర్భిణీ స్త్రీలకు ఇకపై తాత్కాలిక పర్యాటక వీసాలు లేదా మెడికల్ వీసాలు ఇవ్వబోమని చెప్పిన అమెరికా ప్రభుత్వం శుక్రవారం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది, రష్యా, చైనా వంటి దేశాల నుండి సంపన్న కుటుంబాలు జన్మనివ్వడానికి అమెరికాకు రాకుండా నిషేధించడానికి గాను అమెరికా దీన్ని ప్రవేశపెట్టింది. చైనాలో జనాభా నియంత్రణ కోసం ఒక బిడ్డను మాత్రమే కనడానికి అనుమతి ఉంది.
ఇప్పుడు ఇద్దరు పిల్లల విధానాన్ని ఆ దేశం ప్రవేశపెట్టింది. దీనితో ఈ విధానాన్ని తప్పించుకోవాలనుకునే జంటలు దశాబ్దాలుగా పిల్లలు పుట్టడానికి అమెరికాకు వస్తున్నారు. ఈ నేపధ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వైట్ హౌస్ ప్రకటనకు ముందే అమెరికా వీసాలు ఇవ్వడం నిరాకరించింది. అయితే వీసా నిషేధం యుఎస్-మెక్సికో సరిహద్దులో గర్భిణీ స్త్రీలను కూడా ప్రభావితం చేస్తుంది.
మెక్సికోలో ఉండే శరణార్ధ గర్భిణి స్త్రీలకు ఇది ఇబ్బందిగా మారుతుంది. ఇతర వైద్య చికిత్సలు పొందడానికి తాత్కాలిక వీసాలపై యుఎస్‌కు వెళ్లే ప్రజలకు ఇది వర్తించదు. విమానం ఎక్కే ముందే గర్భిణి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. నిబంధనను ఎలా అమలు చేస్తారనే దానిపై వైట్ హౌస్ వివరాలు ఇవ్వనప్పటికీ, ఈ నిబంధన మార్పు శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. యుకె, జర్మనీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇది అమలులో ఉంది.