బ్రేకింగ్; ప్రభుత్వం కీలక నిర్ణయం, ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్…!

-

ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఉంటుందా లేదా అనే ప్రశ్నలు ఇంకా వినపడుతూనే ఉన్న తరుణంలో ఓడిస్సా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇంకా లాక్ డౌన్ పై ఏ ప్రకటన చేయకుండానే ఓడిస్సా కీలక అడుగు వేసింది. ఓడిస్సాలో లాక్ డౌన్ ని ఈ నెల 30 వరకు కొనసాగిస్తున్నట్టు… ఆ రాష్ట్ర సిఎం నవీన్ పట్నాయక్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసారు.

కోవిడ్ -19 సంక్షోభం కొనసాగుతున్న నేపధ్యంలో ఈ లాక్ డౌన్ కాలంలో, మీ క్రమశిక్షణ మరియు త్యాగం కోవిడ్ -19 తో పోరాడటానికి మాకు బలాన్ని అందించాయని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. లాక్ డౌన్ ని పొడిగించిన మొదటి రాష్ట్రం గా ఓడిస్సా నిలిచింది. లాక్ డౌన్ విషయంలో ఇంకా ఏ నిర్ణయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోలేదు. తెలంగాణా, మహారాష్ట్ర, రాజస్థాన్,

ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు లాక్ డౌన్ ని పొడిగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసాయి. ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగానే ఉంది. దేశంలో కరోనా కట్టడి కావాలి అంటే మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ ని పొడిగించడం ఉత్తమం అనే భావనలో కేంద్రం కూడా ఉంది. మోడీ కూడా బుధవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఇదే విషయం చెప్పారు. రేపు సిఎం లతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news