బ్రేకింగ్; ఉస్మానియాలో అలజడి, ప్రొఫెసర్ కి మావోయిస్ట్ లతో సంబంధాలు…!

-

ఉస్మానియా యూనివర్సిటీ కలకలం రేగింది. యునివర్సిటి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కాశీం ఇంట్లో సోదాలు చేపట్టారు పోలీసులు. క్యాంపస్‌ ఆవరణలోని క్వార్టర్స్‌లో కాశీం నివాసం ఉంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయనకు మావోలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో పోలీసులు బృందం సోదాలు కొనసాగిస్తు౦ది. మావోయిస్టులతో కాశీంకు సంబంధాలున్నాయని,

వారితో ఆయనకు లింకులు ఉన్నాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. 2016లో నమోదైన కేసులో భాగంగా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో కాశీం ఏ-2 గా ఉన్నారు. గతంలో ఈ కేసులో మావోయిస్టు పుస్తకాలు, సాహిత్యాలు, స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

ఇప్పుడు మళ్ళీ ఇదే కేసులో మరోసారి పోలీసులు సెర్చ్ వారెంట్‌తో కాశీం ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఈ మధ్యే విరసం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ కాశీంకి కీలక మావోయిస్ట్ నేతలతో సంబంధాలు ఉన్నాయి అనేది పోలీసుల ప్రధాన వాదన. పోలీసులు ఆయన నివాసం ఉంటున్న ఇంటి తలుపులు పగలకొట్టి సోదాలు చేస్తున్నారట. ఆయన సన్నిహితులను విచారిస్తున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news