ఆరోగ్యానికి మంచిద‌ని క్యారెట్ తింటున్నారా.. ఇవి తెలుసుకోండి మ‌రి..!

-

పండ్లు , కందమూలాలు , కందమూలాలు , కందమూలాలు , మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము. వాటిలో క్యారెట్ కూడా ఇక‌టి. ఈ క్యారెట్‌లోనున్న గుణాలు మరెందులోను ఉండవంటున్నారు వైద్యులు. సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతంమంది ఇష్టపడరు. మరి కొంతమంది క్యారెట్‌ను పచ్చి గా తినేందుకు ఇష్టపడతారే కానీ, వండి తే మాత్రం ఇష్టపడరు. కాని, క్యారెట్‌తో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు.క్యారెట్ల లో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.

కొన్ని పరిశోధనల ప్రకారం రెగ్యులర్ గా క్యారెట్ తినడం వల్ల లివర్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది. లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. క్యారెట్టును నిత్యం సేవిస్తుంటే ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం వంటి సమస్యలకు కూడా క్యారెట్‌ చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. అయితే ఆరోగ్యానికి మంచిది కాద‌ని క్యారెట్ ను ఎక్కువగా తింటే మాత్రం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవల్సి వస్తుంది. డయాబెటిక్ వారు క్యారెట్ ఎక్కువ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఓవ‌ర్‌గా క్యారెట్ తిన‌డం వ‌ల్ల ఇరిటేషన్, నిద్రలేమి, నెర్వెస్ నెస్ లాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. సో.. లిమిట్‌గా తింటే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌దు.

Read more RELATED
Recommended to you

Latest news