Breaking : కేఆర్ఎంబీ చైర్మెన్​కు తెలంగాణ ప్ర‌భుత్వం లేఖ.. ఏపీపై ఫిర్యాదు!

-

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ రాసింది. ఈ లేఖలో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప‌లు ప‌నుల గురించి ఫిర్యాదు చేసింది. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప‌లు ప‌నులు ఆపాల‌ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మెన్ ఎంపీ సింగ్ కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఈఎన్సీ ముర‌ళీధ‌ర్ లేఖ రాశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల చేప‌ట్టిన హంద్రీనీవా విస్తరణ పనులు ఆపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ‌లో విజ్ఞప్తి చేసింది.

హంద్రీనీవా ద్వారా కేసీ కెనాల్‌కు నీరు మళ్లింపు ఆపాలని లేఖ‌లో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం విజ్ఞప్తి చేసింది. బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి ఎస్కేప్ ఛానల్ పనులు ఆపాలని లేఖలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు కోరింది. కాగ హంద్రినీవా ప‌థ‌కం రాయ‌ల‌సీమకు నీళ్లు అందించాల‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింది. దీని కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా న‌ది జలాల‌ను తీసుకువ‌స్తున్నారు. కాగ దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version