ఉగాది పంచాంగం శ్రీ శార్వరి నామ సంవత్సర 2020 కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి నాలుగు పాదాలు, ఆశ్లేష నాలుగు పాదాలవారు ఈరాశి పరిధిలోకి వస్తారు.
ఆదాయం:11, వ్యయం-8
రాజపూజ్యం:5, అవమానం-4
కర్కాటక రాశి వారికి ఈసంవత్సరము మిశ్రమఫలితాలు గోచరిస్తున్నాయి. మీ మాటతీరు వృద్ధి అవుతుంది. ఫలితముగా మీరు అనేకమందికి మిత్రులుగా మారతారు. మీ స్నేహితుల సమూహం పెరుగుతుంది. ఇది మీ వృత్తిపరమైన జీవితము ఎదుగుదలకు కారణము అవుతుంది. సంవత్సర ప్రారంభం నుండి సెప్టెంబర్ మధ్యవరకు మీ మాటతీరు, ఆలోచనశక్తి, తాత్విక ప్రక్రియ వృద్ధి చెందటం వల్ల మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అసంపూర్తి పనులను పూర్తి చేయగలుగుతారు. ప్రేమజీవితాన్ని ఆనందముగా ఆస్వాదిస్తారు. నిజమైన ప్రేమకోసము వెతుకుతారు. చివరిగా మీకు దొరుకుతుంది. ఎవరైతే కొత్తసంవత్సరము కూడా ఒంటరిగా జీవించాలనిచూస్తారో వారికి, వారి కుటుంబసభ్యులు పెళ్లిసంబంధాలు కుదురుస్తారు.ఈసంవత్సరము భాగస్వామ్య వ్యాపారస్తులకు అనుకున్న దాని కంటే ఎక్కువగా లాభాలు ఆర్జిస్తారు. ముఖ్యముగా నమ్మకమైన స్నేహితుడితో చేసినటయ్యతే మరిన్ని లాభాలు పొందుతారు. పెట్టుబడులు పెట్టేముందు లాభ నష్టాలను బీరీజు వేసుకుని పెట్టుబడులు పెట్టుట చెప్పదగిన సూచన. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఆర్ధికపరమైన సంస్థలతో మీకున్న సంబంధాల వలన మీరు ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు. మీ సామర్ధ్యముపై ఎల్లపుడు నమ్మకము ఉంచండి. ఇతరులపై ఆధారపడకండి. ఓటమితో కుంగిపోకండి. మీరు ఏం చేసినా మీకు వీలైనంతగా ప్రయత్నించండి. ఇది మీ సామర్ధ్యాన్న మరింతగా పెంచుతుంది. మీ ఆరోగ్యము పట్ల జాగ్రతగా వ్యవహరించుట చెప్పదగిన సూచన. చిరుతిండిని, కారముగా ఉన్న పదార్ధాలను తినకుండా ఉండుట ఉత్తమము. మీరు కనుక పొగాకుకు లేదా మద్యానికి బానిస అయితే వాటిని వెంటనే విడిచిపెట్టండి. ఇలా చేయుటకు చాలా సహనము ఉండాలి, కానీ మీరు ప్రయత్నిస్తే అది సరైనది అని గుర్తిస్తారు. మీరు ఆధ్యాత్మిక లేదా మతపరమైన విషయాల్లో ఆసక్తిని కనపరుస్తారు. దాని కొరకు ధనాన్ని ఖర్చుచేస్తారు. మీరు చేసే పనివల్ల సమాజములో మీ గౌరవమర్యాదలు పెరుగుతాయి.
కర్కాటక రాశి వారి వృత్తి జీవితం
ఈ సంవత్సర ప్రారంభము సానుకూలంగా సాగుతుంది. మీ వృత్తిపరమైన జీవితముకూడా బాగుంటుంది. ఎవరైతే ఉద్యోగము మారాలనుకుంటున్నారో వారికి అనుకూలముగా ఉంటుంది. కొత్త ఉద్యోగములో మీరు మంచిజీతాన్ని అందుకుంటారు. తద్వారా మీ ప్రాధమిక ఖర్చులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు కనుక వృత్తకి కొత్తవారు అయితే మీరు మంచి సంస్థలను ఎన్నుకుని చేరటం మంచిది. మీ కలలపని పనిచేయుటకు మీరు కొంత శ్రమించవలసి ఉంటుంది. దీనికి మీకు సహనము, కష్టపడి పనిచేసే తత్వము ఉండాలి. గురు సంచారము వల్ల మీ వృత్తిపరమైన జీవితములో నిలకడగా రాణిస్తారు. స్నేహితులతో కలసి భాగస్వామ్య వ్యాపారాలు చేయుటవల్ల మీ వ్యాపారము అద్భుతమైన లాభాలను అందుకుంటారు. ప్రయాణములు మీకు మంచిఫలితాలు అందిస్తాయి. విదేశీ ప్రయాణములు మీ వృత్తిపరమైన అభివృదికి తోడ్పడతాయి. ప్రమోషన్‌తో కూడిన స్దానచలనానికి అవకాశములు ఉన్నవి.
కర్కాటక రాశి వారి ఆర్ధికస్థితి
ఆర్ధికపరమైన జీవితములో మీరు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. సంవత్సర ప్రారంభంలో గురువు సంచారమువల్ల, మీరు ఆర్ధిక ఇబ్బందులు పడకూడదు అనుకుంటే, మీరు కష్టపడకతప్పదు. మీ ఖర్చులు విపరీతముగా పెరిగిపోతాయి. మీ ఖర్చులను ఖచ్చితముగా నియంత్రించుకోవలసి ఉంటుంది. జూలై నుండి నవంబర్ మధ్య వరకు మీ రాబడి గణనీయముగా పెరుగుతుంది. మీరుకొన్ని ముఖ్యమైన నిర్ణయములను తీసుకొనవలసి ఉంటుంది. దీనికి మీకు కొంత ధనము అవసరము అవుతుంది. ఆకస్మిక ఖర్చుల సమయములో మీరు ఇబ్బంది పడకుండా మీ కష్టార్జితములో కొంతసొమ్మును పొదుపుకి వాడండి.
ముందువెనుక ఆలోచించకుండా డబ్బును వేటిల్లోనూ పెట్టుబడులుగా పెట్టకండి. ఇతరులకు మీ ధనమును అప్పుగా ఇవ్వకండి. ఎందుకంటే అవిమీకు అవసరమైన సమయములో తిరిగిరావు. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చుచేస్తారు. మీరు ఈసంవత్సరము రిస్క్ చేయకుండా ఉండుట మంచిది.
కర్కాటక రాశి వారి విద్య
ఈరాశి విద్యార్థులు చదువుల్లో మరింత రాణించటానికి పరిథిని దాటి కష్టపడవలసి ఉంటుంది. పోటీపరీక్షలకు ప్రయత్నిస్తునట్టు అయితే, మీ సమయాన్ని, శక్తిని వినియోగించి మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోండి. మీ ధ్యాసను దారిమళ్లించే పరిస్థితులు ఏర్పడతాయి. తద్వారా మీరు మీరు అవకాశాలను కొల్పోయే ప్రమాదం ఉన్నది. ఎవరైతే ఉన్నత చదువుల కొరకు ప్రయత్నిస్తున్నారో వారు సరైన విద్యసంస్థలను ఎంచుకోవటం చెప్పదగిన సూచన. సాంకేతిక విద్యలో చేరటం అనుకూలముగా ఉంటుంది. జనవరి నుండి ఆగస్టు వరకు మీరు మంచిగా మరియు నిలకడగా రాణిస్తారు. మీ లక్ష్యాలు అందుకోగలవి అని నమ్మాలి. కష్టపడి పనిచేయుటవల్ల మీరు ఇతర సమస్యల నుండి బయటపడతారు.
కర్కాటక రాశి వారి కుటుంబ పరిస్థితి
ఈ సంవత్సరం కాలంలో మీరు మంచి, చెడు సమయాన్ని అనుభవిస్తారని అంచనా వేసింది. శనిగ్రహం స్థానం 2020 సంవత్సరంలోపు మీ కుటుంబానికి దూరంగా ఉండటానికి కారణం కావచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం ప్రవాహంగా ఉండవచ్చు. మీరు నాణెం రెండు వైపులా ఎదుర్కోవలసి ఉంటుంది. మీ తల్లి ఆరోగ్యంలో క్షీణత ఉండవచ్చు, ఇది మీ మనశ్శాంతికి భంగం కలిగించవచ్చు. మీరు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె అవసరాలను తీర్చాలి. ఆమె ఆరోగ్య స్థితి క్షీణిస్తే వైద్యుడి సలహా తీసుకోండి. మీ కుటుంబం ముందు అస్తవ్యస్తమైన వాతావరణం కారణంగా మీరు మానసిక శాంతి లేకుండా పోవచ్చు. మీ పన్నెండవ ఇంట్లో రాహువు ఉన్నందున మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేరు. బృహస్పతి, శనిగ్రహాల ఏకకాలిక రవాణా కారణంగా, సంవత్సరం చివరిలో మీ కృషి ఫలితాన్ని పొందుతుంది. తత్ఫలితంగా, మీ కుటుంబం విలాసాలు, సౌకర్యాలలో ఉంటుంది. కుటుంబంలో వివాహ వేడుకలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. మీ బంధువుల పట్ల మీరు కలిగి ఉన్న విధులను మీరు నెరవేర్చాల్సి ఉంటుంది, ప్రత్యేకంగా జూలై నుండి నవంబర్ మధ్య వరకు.
వివాహం- సంతానం
ప్రకారం తెలుపునది ఏమనగా మీ వైవాహిక జీవితమ పట్ల జాగ్రత్త వహించ వలసి ఉంటుంది. మొత్తముగా మీకు 2020 సంవత్సరం మిశ్రమఫలితాలు గోచరిస్తున్నాయి. మీ జీవితభాగస్వామితో మీరు అనేక మధురమైన క్షణాలను గడుపుతారు. ఈసమయములో మీరు ఉన్నతమైనవారిగా భావిస్తారు. మీరు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతారు. జనవరి నెల కొంత కఠినముగా ఉంటుంది. మీ భాగస్వామితో కొంత ఉద్రేగపూరితమైన వివాదాలు ఏర్పడతాయి. ఈ మనస్పర్థల మధ్య ఇతరులు జోక్యం చేఉకోకుండా చూసుకోండి. సహనంగా, ప్రశాంతముగా ఉండటం. మీ వైవాహిక జీవితానికి చాలా మంచిది. మీభాగస్వామి మీపై చూపించే శ్రద్ద, మీకు సహకరించే విధానము, మీతో నిజాయితీగా ఉండాటాన్ని, ఇతరులు చూసి నేర్చుకుంటారు.
2020 మే నెల మధ్య నుండి సెప్టెంబర్ వరకు మీ వైవాహిక జీవితములో అనేక ఎత్తుపల్లాలను చూస్తారు. మీరు చిన్నచిన్న గొడవలను పక్కన పెట్టేయటం చెప్పదగిన సూచన. లేనిచో సమస్యలను నిద్రలేపినట్టు అవుతుంది. ఫిబ్రవరి నుండి మాయావరకు, అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మీ వైవాహిక జీవితము ఆనందముగా, అనుకూలముగా ఉంటుంది. మీభాగస్వామి ఆరోగ్యము మే నెల మధ్య నుండి డిసెంబర్ వరకు క్షిణిస్తుంది. అంగారకుడి స్థితివలన, మీ భాగస్వామి మార్చినెల వరకు కొత్త చికాకు, కోపాన్ని కలిగి ఉంటారు. వారిని ప్రేమతో గౌరవముతో శాంతపరచండి. తద్వారా మీ బంధము మరింత దృఢపడుతుంది. నిజాయితీ, దాపరికము లేనితనము రెండు వివాహానికి పునాదులు అని గుర్తుంచుకోవాలి.
మీ సంతానానికి అనుకూలముగా ఉండదు. మీసంతానము జీవితములో అనేక సమస్యలను సృష్టిస్తుంది. ఇది మీ ఆందోళనలకు ముఖ్యకారణము అవుతుంది. సంతానము ఆరోగ్యము కూడా ఈసమయములో క్షీణిస్తుంది. మీరు వారి ఆరోగ్యము మీద, వారి వృద్ధి మీద దృష్టిపెట్టి వారిని సమయాల నుండి బయటపడేలా చూడవలసిన బాధ్యత మీపై ఉన్నది. మీసంతానము ఆరోగ్యము క్షీణించుటవల్ల వారు చదువుపై ధ్యాసను పెట్టలేరు. ఫలితముగా, వారి విద్యపై ప్రభావాన్ని చూపుతుంది. జూలై నుండి నవంబర్ మధ్య వరకు మీ సంతానమునకు అనుకూలముగా ఉంటుంది. వారి జీవితాన్ని ఆనందముగా గడుపుతారు. విలువైన పాఠాలను నేర్చుకుంటారు.
కర్కాటక రాశి వారి ఆరోగ్యం
ఈరాశి సంవత్సరము ఆరోగ్యపరముగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి, మీరు అనారోగ్యానికి గురి అయ్యే ఎటువంటి పనులను చేయకండి. ఆరోగ్యకరమైన జీవనవిధానమును అలవర్చుకోండి. తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. ప్రతిరోజు వ్యాయామము చేయుటవల్ల మీరు మీ ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకుంటారు. మీరు జ్వరము, టైఫాయిడ్ దద్దర్లు మొదలగునవి.. వంటి వ్యాధులతో ఇబ్బంది పడతారు. వీటిని నిర్లక్ష్యం చేయకుండా అవసరమైనప్పుడు డాక్టరును సంప్రదించుట చెప్పదగిన సూచన. సంవత్సర ప్రారంభము నుండి మార్చి వరకు, తరచుగా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చును. 2020 జాతకం ప్రకారము ఏప్రిల్ నుండి మీ ఆరోగ్యము నెమ్మదిగా వృద్ధిచెందుతుంది. జూలై నెలలో తిరిగి మీరు అనారోగ్య సమస్యలను ఎదురుకుంటారు. ఇది నవంబర్ వరకు కొనసాగుతుంది. అనారోగ్య సమస్యలు చిన్నవి అయినప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. శని 7వ ఇంట సంచారము వల్ల అనుమానాస్పద ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చును. మీరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశము ఉన్నది. వాటిని తొలగించటం అంత సులభమైన పనికాదు. ఒత్తిడికి, ఆందోళనకు గురి అవ్వకండి. ధ్యానము, యోగ ప్రతిరోజు చేయండి. ప్రొద్దునే లేవటం అలవాటు చేసుకోండి. జూలైలో అంగారకుడి సంచారము వల్ల మీరు హృదయ సంబంధిత సమస్యలు ఎదురుకుంటారు.
పరిహారాలు
– ఛాయపాత్రను శనివారం దానము చేయండి. మట్టితో కానీ లేక ఇనుముతో చేసిన గిన్నెతీసుకుని దానినిండా ఆవనూనె పోయండి. అందులో మీ ముఖము చూసి, దానిని దానం చేయండి. మీరు ఈ సంవత్సరం ముత్యమును ధరించండి. సుందరకాండ, హనుమాన్ చాలీసా ప్రతి మంగళవారం పఠించండి మరియు శనివారము మల్లెనూనెతో దీపారాధన చేయండి. శనగలను, బెల్లము లేదా భూందీ చిన్నపిల్లలకు దానముచేయండి.
నోట్- ఈ ఫలితాలు చంద్రుని సంచారం ఆధారముగా గణించబడినది.
– శ్రీ