బ్రేకింగ్ ;నిర్భయ దోషులకు రేపు ఉరి రద్దు…!

-

నిర్భయ అత్యాచార హత్య కేసు నిందితుల్లో ఒకడు అయిన పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషిన్ ని సుప్రీం కోర్ట్ కొట్టేసింది. ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని పిటిషిన్ వేసిన పవన్ గుప్తా అభ్యర్ధనను సుప్రీం కోర్ట్ తిరస్కరించింది. ఇక ఇదిలా ఉంటే ఢిల్లీ కోర్ట్ లో అక్షయ్ సింగ్ పిటీషన్ విచారణ జరుగుతుంది. పాటియాలా కోర్ట్ లో కూడా అక్షయ్ సింగ్ పిటీషన్ ఉన్న నేపధ్యంలో రేపు ఉరి అనుమానమే అంటున్నారు న్యాయవాదులు.

వాళ్ళను మార్చ్ 3వ తేదీన ఉరి తీయాలని పాటియాలా హౌస్ కోర్ట్ డెత్ వారెంట్ ఇచ్చింది. ఇప్పటి వరకు వాళ్ళ ఉరి మూడు సార్లు వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ వాయిదా పడితే మాత్రం న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీని వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కావాలి అనే వాళ్ళను ఉరి తీయడం లేదని అంటున్నారు.

ఒకరకంగా చెప్పాలి అంటే వాళ్ళు న్యాయ వ్యవస్థతో ఆడుకుంటున్నారు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు క్షమాభిక్ష పిటీషన్ ని, క్యురేటివ్ పిటీషన్ ని, స్టే విధించాలని ఒక పిటీషన్ ని వేస్తూ సమయ౦ వృధా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక వారి తరుపు న్యాయవాదులు కూడా కొత్త డ్రామాలు ఆడటం విశేషం. మరి మార్చ్ 3 న ఉరి తీస్తారో లేదో తెలియదు.

Read more RELATED
Recommended to you

Latest news