సింగ‌రేణి స‌మ్మెకు బ్రేకులు.. నేడు విధుల్లో కి కార్మికులు

-

తెలంగాణ లో గ‌ల సింగ‌రేణి కి చెందిన బొగ్గు గ‌నుల చ‌ను ప్ర‌యివేటీ కరించాల‌న్న కేంద్ర నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌డుతు సింగ‌రేణి కార్మికులు స‌మ్మె బాట ప‌ట్టిన విషయం తెలిసిందే. అయితే నిన్న సింగ‌రేణి కార్మికులు.. రీజ‌న‌ల్ లేబ‌ర్ కమిష‌న‌ర్ తో చర్చ‌లు జ‌రిపారు. బొగ్గు గ‌నుల విష‌యం తో పాటు సింగ‌రేణి కార్మికుల డిమాండ్ల ను కేంద్రం దృష్టి కి తీసుకెళ్తాన‌ని రీజిన‌ల్ లేబ‌ర్ క‌మిష‌న‌ర్ హామీ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. దీంతో సింగ‌రేణి కార్మికులు స‌మ్మె ను తాత్కాలికం గా బ్రేకులు వేశారు.

అలాగే నేటి నుంచి సింగ‌రేణి కార్మికులు విధుల్లో చేర‌నున్నారు. అయితే వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 20 న సింగ‌రేణి కార్మికులు మ‌రో సారి స‌మావేశం కానున్నారు. అప్పుడు తమ డిమాండ‌ల పై కేంద్రం తీసుకున్న పురోగ‌తి పై చ‌ర్చించి స‌మ్మె పై నిర్ణ‌యం తీసుకోనున్నారు. అయితే బొగ్గు గ‌నుల ను ప్ర‌యివేటీక‌ర‌ణ చేయ‌వ‌ద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కూడా కేంద్రానికి లేఖ రాసారు.

Read more RELATED
Recommended to you

Latest news