టీటీడీ శ్రీవారి భక్తులకు దేశీయ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన పంటలతో సంప్రదాయ భోజనాన్ని అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ధర ఎక్కువగా ఉండటంతో తీవ్రవిమర్శలు ఎదురవుతున్నాయి. కాగా కావాలనే సంప్రదాయ భోజనం పై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
ఈ నేపథ్యంలోనే సంప్రదాయ భోజనంపై అధికారులతో సమావేశం నిర్వహించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక నిన్న టీటీడీ కల్యాణ మండపాలను కూడా దేవాలయాలకు, లీజుకు ఇస్తామని ప్రకటించింది. దానిపై కూడా విమర్శలు మొదలయ్యాయి. మరి కల్యాణ మండపాల లీజు విషయంలో టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.