అండగా మేమున్నాం..హిందీలో వీడియో రిలీజ్ చేసిన బ్రిటీష్ హై కమిషనర్

భారతదేశానికి బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆయన హిందీలో మాట్లాడుతూ ఒక వీడియో చేశారు కరోనా వైరస్ మీద పోరాటంలో సహాయపడటానికి యుకె భారతదేశానికి వైద్య పరికరాలతో సహకరిస్తుందని చెప్పారు. వీడియోలో, ఎల్లిస్ హిందీలో మాట్లాడటం గమనించ వచ్చు. ఈ కష్టంలో భారత్ వెంట యూకే ఉంది. మా ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఈరోజు ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు భారత్ పంపించడానికి ఏర్పాట్లు చేశారు.

భారత్ లో కరోనా ను పారద్రోలేందుకు బ్రిటన్ ఎల్లప్పుడూ భారత్కు సహాయం చేస్తూ ఉంటుంది. అందరం కలిస్తే ఇదేమీ పెద్ద కష్టం కాదు అని అని హిందీలో చెప్పుకొచ్చారు. మన దేశం కోవిడ్ ఇన్ఫెక్షన్ల యొక్క వినాశకరమైన సెకండ్ వేవ్ తో పోరాడుతున్నప్పుడు వెంటిలేటర్లు మరియు ఆక్సిజన్ సిలిండర్లు సహా ప్రాణాలను రక్షించే వైద్య పరికరాలను భారతదేశానికి పంపనున్నామని UK ప్రభుత్వం ప్రకటించిన కొద్దిసేపటికే ఎల్లిస్ నుండి ఈ ప్రకటన వచ్చింది.