బ్రేకింగ్: వేమూరి రాధాకృష్ణకు జగన్ ఫోన్

ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల డైరెక్టర్ కనకదుర్గ మరణం పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ సిఎం వైఎస్ జగన్ వేమూరి రాధాకృష్ణకు ఫోన్ చేసి పరామర్శించారు. రాధాకృష్ణకు ఫోన్ చేసి కనకదుర్గ మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నా అని అన్నారు. అలాగే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా వేమూరి రాధాక్రిష్ణకు ఫోన్ చేసి పరామర్శించారు.

ధైర్యంగా ఉండాలని రాహుల్ గాంధీ సూచించారు. కాగా 63 ఏళ్ళ కనకదుర్గ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. నేడు ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు. ఏపీ మాజీ సిఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణా సిఎం కేసీఆర్, సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అందరూ సంతాపం వ్యక్తం చేసారు.