జీతం సరిపోకపోవడం లేదంట..ఆర్నెళ్లలో రాజీనామా చేయనున్న ప్రధాని

-

ఒక దేశ ప్రధాని అంటే మామూలు విషయం కాదు. అధికారం, హోదా, సంపాదన ఇలా ఏ రకంగా చూసినా అబ్బో అనిపించే పోస్టు! కానీ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ విషయం ఇందుకు విరుద్ధంగా ఉంది..మరో ఆరు నెలల్లో ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. అందుకు కారణం ఆయన వేతనం చాలకపోవడమే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని కాకముందు ఆయన టెలిగ్రాఫ్‌ పత్రికలో కాలమిస్టుగా పని చేసేవారు. అప్పుడు తనకు ఏటా రెండున్నర కోట్లకుపైగా సంపాదించిన వచ్చేదని.. దాంతోపాటు నెలకు రెండు ప్రసంగాలివ్వడం ద్వారా అదనంగా ఆదాయాన్ని పొందేవారు..

అయితే, ప్రస్తుతం ప్రధానిగా బోరిస్‌కు ఒక కోటి నలభై లక్షల జీతమే వస్తోంది. దీంతో, ఈ సంపాదన తన ఆరుగురు సంతానాన్ని పోషించేందుకు..విడాకులు ఇచ్చిన ఒక భార్యకు భరణం ఇవ్వాల్సి రావడం మరింత భారంగా మారిందని బోరిస్‌ చెప్పినట్లు బ్రిటన్‌ మీడియా పేర్కొంది..ప్రస్తుతం ఆయన ఉంటున్న ఇంట్లో కనీసం హౌస్‌కీపర్‌ కూడా లేదని, అసలా ఇల్లే పెద్ద మురికికూపమని బోరిస్‌ స్నేహితులు చెప్పినట్లు కథనం పేర్కొంది. బోరిస్‌కు ముందు ప్రధానిగా ఉన్న థెరిసా మే ప్రస్తుతం లెక్చర్లిస్తూ దాదాపు 10 లక్షల పౌండ్లు వెనకేశారని డైలీ మిర్రర్‌ వెల్లడించింది

Read more RELATED
Recommended to you

Latest news