రాధేశ్యామ్ న్యూ అప్డేట్ : విక్రమాదిత్య అలరించబోతున్న ప్రభాస్..

-

తాజాగా రాధేశ్యామ్ సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎన్నో రోజులు నుండి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఆయన తాజాగా నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమా సంబంధించి ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23న పురస్కరించుకొని రాధేశ్యామ్ సినిమా నుండి ఆయన లుక్ తెలిసేలా మరో సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించబోతున్నాడు.

చాలా రోజుల తర్వాత ప్రభాస్ కొత్త లుక్ లో కనపడటంతో అభిమానులు తెగ సంతోషంతో మునిగిపోయారు. వింటేజ్ ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్, యు.వి.క్రియేషన్స్ సంస్థలు కలిపి నిర్మిస్తున్నాయి. ఇందుకు సంబంధించి యు.వి.క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా ఈ కొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news