ఎన్నో అంచనాల మధ్యన రిలీజ్ అయిన తమిళ రీమేక్ మూవీ బ్రో కు మిశ్రమ స్పందన వచ్చింది. రివ్యూ లను చూస్తే ఒక్కో ఛానెల్ ఒక్కోలా ఇస్తూ వచ్చాయి. కానీ సగటు ప్రేక్షకుడిలా సినిమాను చూస్తే మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ కోసమే చేశారని క్లియర్ గా అర్ధమయ్యే చాలా సీన్ లు ఉన్నాయి. తమిళ్ లో సినిమా చూసిన వారికి తెలుగు సినిమా చూస్తే ఏమంత రుచించకపోవచ్చు. ఎందుకంటే తమిళ్ లో సహజంగా కథాజు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి తీశారు.. కానీ బ్రో సినిమా మాత్రం వ్యక్తుల కోసం సినిమా కథను అనుగుణంగా మార్చుకున్నట్లు స్పస్టముగా కనబడుతోంది. రెండు భాషలలోనూ డైరెక్టర్ ఒకరే అయినా, ఆ డైరెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కావడం కారణంగానే ఫలితం ఇలా రావడం. హీరోయిన్ల పాత్రలు, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో లాగ్, ముఖ్యంగా ఈ సినిమాకు ప్రధానమైన ఎమోషన్ విషయంలో అస్సలు కనెక్ట్ కాలేకపోవడం పెద్ద మైనస్.
ఓవరాల్ గా ఈ సినిమా కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రమే. మరి కలెక్షన్ లు ఏ మేరకు వస్తాయన్నది తెలియాల్సి ఉంది.